గణపతి పూజ

శ్రీ గురుభ్యోనమః

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ॥

(ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా ।
      యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరస్శుచిః ॥
ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః
(అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి

శ్లో॥ ఘృతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం ।
      దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ ॥

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా    (జలపానము చేయవలెను)
ఓం నారాయణాయ స్వాహా    (జలపానము చేయవలెను)
ఓం మాధవాయ స్వాహా    (జలపానము చేయవలెను)
ఓం గోవిందాయ నమః    (ఎడమ చేతిని కుడి అరచేతితోను)
ఓం విష్ణవే నమః    (కుడి చేతిని ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
ఓం మధుసూదనాయ నమః    (బొటన వేలితో పై పెదవిని)
ఓం త్రివిక్రమాయ నమః    (బొటన వేలితో క్రింది పెదవిని)
ఓం వామనాయ నమః    (శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం శ్రీధరాయ నమః    (శిరమున జలము చల్లుకొనవలెను)
ఓం హృషీకేశాయ నమః    (ఎడమ అరచేతిపైనను )
ఓం పద్మనాభాయ నమః    (రెండు పాదముల పైనను)
ఓం దామోదరాయ నమః    (శిరము పైన నీరు చల్లుకొనవలెను)
ఓం సంకర్షణాయ నమః    (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
ఓం వాసుదేవాయ నమః    (ఎడమ ముక్కును)
ఓం ప్రద్యుమ్నాయ నమః    (కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
ఓం అనిరుద్ధాయ నమః    (ఎడమ కన్నును)
ఓం పురుషోత్తమాయ నమః    (ఎడమ చేతిని )
ఓం అధోక్షజాయ నమః    (ఎడమ చేతిని)
ఓం నారసింహాయ నమః    (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను)
ఓం అచ్యుతాయ నమః    (నాభిని అంగుష్ఠ కనిష్ఠికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
ఓం జనార్దనాయ నమః    (అరచేతిని హృదయమునకు ఆనించాలి)
ఓం ఉపేంద్రాయ నమః    (శిరమును కరాగ్రముతో తాకవలెను)
ఓం హరయే నమః    (బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
ఓం శ్రీకృష్ణాయ నమః.

భూతోచ్ఛాటనము

శ్లో॥ ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ।
      ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥

(శ్లోకము చదివి - అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి.)

అథః ప్రాణాయామః

(కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి)

శ్లో॥ ఓం భూః, ఓం భువః , ఓగ్o సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః,
      ఓగ్o సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
      ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ॥

సంకల్పము

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రాహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) అయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ, శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపచారైః సంభవితా నియమేన, యావచ్ఛక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే...

(అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.)
తదంగ కలశ పూజాం కరిష్యే...

కలశపూజ

(కలశం, అంటే గంధము, కుంకుమతో అలంకరించిన నీటి పాత్రకు అక్షతలు, పుష్పము వేసి ఎడమ అర చేతితో కింద పట్టుకొని కుడి అరచేతితో పైన పట్టుకుని)

శ్లో॥ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
      మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
      కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
      ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
      అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
      గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
      నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ॥

ఆయాంతు శ్రీ మహా గణాధిపతి పూజార్థం దురితక్షయ కారకాః ॥

(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ)
కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య.

(దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య.

శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ।
      అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥

షోడశోపచార పూజ

ఓం శ్రీమహాగణపతయే నమః :- ధ్యాయామి - ధ్యానం సమర్పయామి.
      (ఒక పుష్పమును దేవుడి వద్ద వుంచవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- ఆవాహయామి
      (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి వద్ద వుంచవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- రత్న సింహాసనం సమర్పయామి
      (కొన్ని అక్షతలు సమర్పించవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- పాదయోః పాద్యం సమర్పయామి
      ( పుష్పంతో నీరు దేవుడి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీమహాగణపతయే నమః :- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
      (పుష్పంతో నీరు దేవుడి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి
      (పుష్పంతో నీరు దేవుడి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).
ఓం శ్రీమహాగణపతయే నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి
      (పుష్పంతో నీరు దేవుడి మధుపర్క స్నానానికి సమర్పించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి.
      (పుష్పంతో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి
      (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి
      (కుంకుమ ధారణ చేయాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి - యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి
      (అక్షతలు వేయాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- శ్రీ గంధాం ధారయామి
      (గంధం సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- సర్వాభరణాన్ ధారయామి
      (అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
      (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).

షోడశ నామ పూజ

ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంభాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
ఓం గణాధిపతయే నమః

షోడశ నామ పూజా సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- ధూపమాఘ్రాపయామి
      (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- దీపం దర్శయామి
      (దీపం చూపించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- నైవేద్యం సమర్పయామి
      (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ)

ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయనః ప్రచోదయాత్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషంచామి
      (మూడు సార్లు పుష్పముతో గాని, ఉద్ధరిణితో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశలో ఎడమ నుండి కుడి వైపుకు తిప్పాలి).
అమృతమస్తు
      (నైవేద్యం పై జలమును వుంచి)
అమృతోపస్తరణమసి
      (అదే నీటిని దేవుడి వద్ద ఉంచాలి).

దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు తినిపిస్తున్నట్టు బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళతో చూపవలెను.

ఓం ప్రాణాయ స్వాహా—ఓం అపానాయ స్వాహా—ఓం వ్యానాయ స్వాహా—ఓం ఉదానాయ స్వాహా—ఓం సమానాయ స్వాహా—ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.

ఓం శ్రీమహాగణపతయే నమః :- తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.
      (తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి
      (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- మంత్ర పుష్పం సమర్పయామి
      (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహాగణపతయే నమః :- నమస్కారం సమర్పయామి
      (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)

శ్లో॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
      తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే
      పాపో౽హం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ
      త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత
      అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం
      తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ॥

ఓం శ్రీమహాగణపతయే నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి
ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి.
      (అంటూ అక్షతలు సమర్పించవలెను). అనయా, యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ - శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు. ఓం శ్రీమహాగణపతయే నమః :
      (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ )

శ్లో॥ కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ ।
      కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ॥

ఉద్వాసన

శ్లో॥ ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
      తాని ధర్మాణి, ప్రథమాన్యాసన్
      తేహ నాకం మహిమానస్సచంతే
      యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః

శ్లో॥ యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు: ।
      న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ॥

శ్లో॥ మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ।
      యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే ॥

అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజాయాచ భగవాన్సర్వాత్మక శ్రీ గణపతి దేవతా స్సుప్రీతో సుప్రసన్నా వరదో భవతు.

శ్రీ వినాయక ప్రసాదం శిరసా గుహ్ణామి
      (నమస్కరించి స్వామి వద్ద నున్న అక్షతలు తీసి తలపై వేసుకొని ప్రసాదమును (అనగా అక్షతలు మాత్రమే) స్వీకరించ వలెను).

ఆ తరువాత మరల ఆచమనం చేసి చేయదలుచుకున్న వ్రతం గాని, పూజ కానీ ప్రారంభించ వలెను.